సాక్షి, తిరుమల : తిరుమలలో సర్వదర్శనం భక్తులుకు ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన స్లాట్ దర్శన విధానం విజయవంతం అయ్యిందని టీటీడీ కార‍్యనిర‍్వహణాధికారి సింఘల్ చెప్పారు. మొదటి ఐదు రోజుల‍్లో 60 వేల మంది భక్తులు టోకెన‍్లు పొందితే శనివారం ఒక‍్కరోజే ఇప‍్పటివరకూ 18 వేల మంది భక్తులు టోకెన‍్లు పొందారని ఆయన వివరించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి నుంచి పూర్తిస్థాయిలో స్లాట్ దర‍్శనం విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. తిరుమలలో పాటు తిరుపతిలో కూడా టోకెన‍్లు జారీచేస్తామని ఆయన తెలిపారు.