ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు | Six people injured MLA car - auto accident in Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు

Feb 23 2014 1:24 PM | Updated on Nov 6 2018 4:55 PM

ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు - Sakshi

ఎమ్మెల్యే కారు ఢీ కొని ఆరుగురుకి తీవ్ర గాయాలు

మహబూబ్నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం కట్టబండ వద్ద ఆదివారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది.

మహబూబ్నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం కట్టబండ వద్ద ఆదివారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు  తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే  అంగరక్షకులు, అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ఇద్దరు పరిస్థితి విషంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆ ప్రమాదంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement