క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ | Six arrested for betting on IPL matches | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

May 7 2018 8:07 AM | Updated on Nov 6 2018 4:37 PM

Six arrested for betting on IPL matches  - Sakshi

ఆదోని రూరల్‌: ఆదోని శివారు ప్రాంతంలోని శిరుగుప్ప క్రాస్‌ సమీపంలో మాధవరం రోడ్డులోని ఫ్రెండ్స్‌ రైస్‌ మిల్లు వద్ద ఆదివారం క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు ఇస్వీ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఆదోని పట్టణానికి చెందిన ఏఎం ప్రవీన్, వీరస్వామి, అరాఫత్, ధనుంజయ, నబీ రసూల్, నబీ బాషాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. స్థానికుల సమాచారం మేరకు  తనతో పాటు క్రైం పార్టీ ఏఎస్‌ఐ ఆనంద్, హెడ్‌కానిస్టేబుల్‌ శాంతరాజు, కానిస్టేబుల్‌ ఎలిషా దాడుల్లో పాల్గొన్నట్లు వివరించారు. దాడుల్లో రూ.20,630, ఎనిమిది మొబైల్స్, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న  రామాంజినేయులు అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement