ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది.
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది. పరిశీలనలో భాగంగా కర్నూలులో నాటి అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలను శివరామకృష్ణన్ కమిటీ పరిశీలించింది. అనంతపురం జిల్లాలో కూడా కమిటీ పర్యటించనుంది. రాయలసీమ పర్యటన అనంతరం కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చేందుకు శివరామకృష్ణన్ కమిటీ సమాయత్తమవుతోంది.
ఇప్పటికే కమిటీ విశాఖపట్నం, తిరుపతి, విజయవాడు, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాలను పరిశీలించింది. కాగా గుంటూరు, విజయవాడల సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు ప్రయత్నాలను నిరసిస్తున్న సమయంలో శివరామకృష్ణన్ కమిటీ రాయలసీమ పర్యటనకు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.