శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) అనంతపురం జిల్లాలో పర్యటించనుంది.
అనంతపురం: నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. కమిటీ సభ్యులు హైదరాబాద్ నుంచి 7వ తేదీ రాత్రికి అనంతపురం చేరుకుని ఆర్‌డీటీ అతిథిగృహంలో బస చేస్తారు.
8వ తేదీ మంగళవారం ఉదయం నగరంలోని రెవెన్యూభవన్‌లో ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు, జిల్లా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. శివరామకృష్ణన్ కమిటీ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించింది.