అక్కాతమ్ముడి ఆత్మహత్యాయత్నం | Sister, Brother attempt to suicide at Nizamabad district | Sakshi
Sakshi News home page

అక్కాతమ్ముడి ఆత్మహత్యాయత్నం

Nov 7 2013 4:53 AM | Updated on Nov 6 2018 7:53 PM

మండలంలోని ఐలాపూర్‌లో బుధవారం అక్కాతమ్ముడు విషం సేవించి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 లింగంపేట,న్యూస్‌లైన్ : మండలంలోని ఐలాపూర్‌లో బుధవారం అక్కాతమ్ముడు విషం సేవించి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్సై రాకేశ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మల్లయ్యల పోచయ్య, ఆయన అక్క మానెవ్వ కుటుంబ సమస్యలు, మానసిక వ్యధతో ఆత్మహత్యకు యత్నించారు. పోచయ్య భార్య నర్సవ్వ కొంతకాలంగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచూ భర్తతో గొడవ పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసేది. ఈక్రమంలో పోచయ్య ఇటీవల భార్యతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాడు. రూ.50 వేలు భార్యకు అందించాడు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మానెవ్వ, పోచయ్యలు ఆత్మహత్యకు యత్నించారని ఎస్సై తెలిపారు. స్థానికుల సమాచారంతో ఇద్దరిని 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని చెప్పారు.
 
 నాగిరెడ్డిపేటలో వివాహిత..
 నాగిరెడ్డిపేట : మండలకేంద్రానికి చెందిన చిరుకొండ సవిత(23) బుధవారం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. సవిత తన అత్త అంజవ్వతో వ్యవసాయభూమి విషయమై గొడవపడ్డారు. ఈక్రమంలోనే ఆము ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై చల్లుకోని నిప్పంటించుకుంది. స్థానికులు వెంటనే మంటలు ఆర్పివేసి, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సవిత భర్త ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement