తమ మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని ... | To plot the bifurcation of the Council ... | Sakshi
Sakshi News home page

తమ మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని ...

Sep 2 2016 8:44 PM | Updated on Sep 4 2017 12:01 PM

తమ మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని ...

తమ మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని ...

కూతవేటు దూరంలో ఉన్న తమ మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట మండల ప్రజలు డిమాండ్‌ చేశారు.

మెదక్‌కు తరలివచ్చిన నాగిరెడ్డిపేట మండల వాసులు
ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
స్వాగతం పలికిన స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు
మెదక్‌ మున్సిపాలిటీ
:కూతవేటు దూరంలో ఉన్న తమ మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట మండల ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు పలు వాహనాల్లో మెదక్‌ పట్టణానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు నాగిరెడ్డిపేట మండల ప్రజలకు ఎదురుగా వెళ్లి పూలదండలు వేసి స్వాగతం పలికారు.

అనంతరం వారితో కలిసి ఆర్డీఓ కార్యాలయం బైఠాయించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండల రైతు నాయకులు నర్సింహారెడ్డి,  జెడ్పీటీసీ మాజీ సభ్యులు జయరాజ్‌లు మాట్లాడుతూ.. తమ మండలం మెదక్‌ పట్టణానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. తమ ప్రాంత నాయకులు రాజకీయ స్వలాభం కోసం 60 కిలో మీటర్ల దూరంలో గల కామారెడ్డిలో మండలాన్ని కలుపుతున్నారని మండిపడ్డారు. మండల ప్రజలు ఏ అవసరానికైనా మెదక్‌కు వస్తారని తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండలానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి, మహేష్, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

------------------
02ఎండికె04ఏ: ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేస్తున్న నాగిరెడ్డిపేట వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement