నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె | seemandhra Revenue employees to go on indefinite strike | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె

Feb 5 2014 3:11 AM | Updated on Sep 2 2017 3:20 AM

జిల్లాలో ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం

 విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొని సమైక్యతను చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మె దినాలను క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తూ జీఓ జారీ కావడంపై రెవెన్యూ అసోషియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement