హైదరాబాద్‌లో ఓటింగ్ పెట్టి చూడండి:భూమా నాగిరెడ్డి | seemandhra leaders should stand on united state | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఓటింగ్ పెట్టి చూడండి:భూమా నాగిరెడ్డి

Aug 16 2013 7:06 PM | Updated on Sep 1 2017 9:52 PM

హైదరాబాద్‌లో ఓటింగ్ పెట్టి చూడండి:భూమా నాగిరెడ్డి

హైదరాబాద్‌లో ఓటింగ్ పెట్టి చూడండి:భూమా నాగిరెడ్డి

రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పెట్టి చూస్తే..ఎక్కువ మంది దేనికి మద్దతు ఇస్తున్నారో తేలిపోతుందని వైఎస్సార్‌సీపీ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు.

కర్నూలు: రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పెట్టి చూస్తే..ఎక్కువ మంది దేనికి మద్దతు ఇస్తున్నారో తేలిపోతుందని వైఎస్సార్‌సీపీ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు. రాజకీయ నేతల తీరుపై మండిపడ్డ భూమన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన జరిగిందని ఒకసారి, జరగలేదని మరొకసారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర రాజకీయ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారి ఓటింగ్ పెడితే ప్రజలు సమైక్యాంధ్రాకే మద్దతిస్తారని తెలిపారు.
 
 సమైక్యాంధ్ర మద్దతుగా ఉద్యమం మరింత ఊపందుకుంది. రాష్ట్ర విభజన  అంశంపై సీమాంధ్ర ఆందోళన కారులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement