సీమాంధ్ర ఉద్యోగులు కావాలనే తెలంగాణవాదులను రెచ్చగొడుతున్నారని.. ఇది సరైం ది కాదని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు ఎన్.ప్రతాప్‌రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యోగులు కావాలనే తెలంగాణవాదులను రెచ్చగొడుతున్నారని.. ఇది సరైం ది కాదని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు ఎన్.ప్రతాప్‌రెడ్డి అన్నారు. విద్యుత్ సౌ దాలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులకు జరి గిన ఘర్షణలో భాగంగా నిజనిర్ధారణ కమిటీగా వెళ్లిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆదిలాబాద్‌లో న్యాయవాదులు విధులు బహిష్కరిం చారు. బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదు ట నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా అధ్యక్షు డు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటనను సీ మాంధ్ర ఉద్యోగులు అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు సో దరభావంతో మెలుగుతారని, సీమాంధ్రుల హ క్కులకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చే శారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి దాసిరి గంగారం, ఉపాధ్యక్షుడు దేవేందర్‌సింగ్, సంయుక్త కార్యదర్శి సుధీర్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు అబ్దుల్ కలీం, హన్మంత్‌రావు, మోహన్‌సింగ్, నరేష్‌కుమార్ జోషి, అశోక్‌రెడ్డి, శ్రీరాం, ప్రమోద్, మహేంధర్‌రెడ్డి పాల్గొన్నారు.