సంక్రాంతి సంబరాలకు సీఎం | Sankranti festivities CM | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సంబరాలకు సీఎం

Jan 13 2015 12:39 AM | Updated on May 29 2019 3:19 PM

సంక్రాంతి సంబరాలకు సీఎం - Sakshi

సంక్రాంతి సంబరాలకు సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖ రానున్నారు.

మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖ రానున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి జాతీయ రహదారి గుండా కైలాసగిరి చేరుకొని అక్కడ జిల్లా యంత్రాంగం అధికారకంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను గాలిపటాలు ఎగరేసి   ప్రారంభించనున్నారు. అక్కడ  కొంతసేపు పండగ సంబరాల్లో అధికారులు, ప్రజలతో గడపనున్నారు. అనంతరం అక్కడ నుంచి బీచ్‌రోడ్ గుండా హోటల్ నోవాటెల్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగే సదస్సులో సింగపూర్ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు. అనంతరం 12 గంటలకు బయల్దేరి విజయవాడ వెళ్తారు.

సరకుల కొరత వల్లే సంక్రాంతి కానుకల పంపిణీ రద్దు?

జిల్లాలో తెల్లకార్డుదారులకు సరిపడినన్ని చంద్రన్న సంక్రాంతి కానుకలు రాకపోవడం వల్లే మంగళవారం సత్యం జంక్షన్‌లో సీఎం పంపిణీ చేయాల్సిన సంక్రాంతి కానుక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఒక వేళ ఆర్భాటానికి పోయి ప్రారంభిస్తే సరకులు అందని వారు ఆందోళన చేసే అవకాశం ఉందని గ్రహించి ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారని సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement