సమైక్యాంధ్ర సీఎం ఖబడ్దార్! | Samaikyandhra CM Khabaddar! | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర సీఎం ఖబడ్దార్!

Sep 29 2013 4:48 AM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమైక్యాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఖబడ్దార్, నోరు అదుపులో పెట్టుకోకుంటే తెలంగాణ విద్యార్థులు...

తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమైక్యాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఖబడ్దార్, నోరు అదుపులో పెట్టుకోకుంటే తెలంగాణ విద్యార్థులు  చిత్తూరుకు తరిమికొడతారని టీఎస్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం తెలంగాణ యూనివర్సిటీ కళాశాల భవనం ఎదుట టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ యెండల ప్రదీప్ మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తానికి సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా మాట్లాడుతున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజలచే, ఎమ్మెల్యేలచే ఎన్నుకున్న సీఎం కారని, సీల్డ్ కవర్ సీఎం అని గుర్తుంచుకోవాలన్నారు.  దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకోసం ఉద్యమాలు చేసుకోవాలని  హితవు పలికారు. ఇలాగే ప్రవర్తిస్తే తెలంగాణ విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్ జేఏసీ నాయకులు నాగరాజు, సతీశ్ గౌడ్, నాగభూషణం, వెంకటేశ్, బీరయ్య  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement