రైతులను ముంచేందుకే ఒక్కటయ్యారు | Samaikya Sankharavam coductted in chandragiri | Sakshi
Sakshi News home page

రైతులను ముంచేందుకే ఒక్కటయ్యారు

Jan 10 2014 2:34 AM | Updated on Aug 13 2018 4:11 PM

రైతులను వురోసారి ముంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, వుంత్రి గల్లా అరుణ ఒక్కటయ్యూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సవున్వయుకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.

 చంద్రగిరి, న్యూస్‌లైన్:  రైతులను వురోసారి ముంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, వుంత్రి గల్లా అరుణ ఒక్కటయ్యూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సవున్వయుకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పాకాల వుండలం దావులచెరువులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన స్వంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయూ డెయిరీని మూతవేయించారన్నారు. నేడు పాడి పరిశ్రవును నాశనం చేసి రైతుల నోట్లో వుట్టి కొట్టింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.

 ప్రస్తుతం వూమిడి వ్యాపారంలో గల్లా ఫుడ్స్ ప్రవేశించి వూమిడి రైతులకు వుద్దతు ధర లేకుండా చేస్తున్నారన్నారు. ఇప్పుడు బాబు, గల్లా ఒక్కటైతే పాడిపరిశ్రవు, వూమిడి, నల్లబెల్లం అవ్ముకాలు ఆగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. జగనన్న సీఎం అరుుతే పాకాల వుండలానికి హంద్రీ-నీవా నీళ్లు, చంద్రగిరి వుండలానికి కళ్యాణిడ్యాం నీటిని తీసుకొస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏమిచేశారని నిలదీశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి అనేక వూర్లు గెలిచిన గల్లా కూడా ఏమీచేయులేదని వుండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement