కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు!  | Salt Merchant Have Coronavirus Positive In Chittoor District | Sakshi
Sakshi News home page

కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు! 

Apr 22 2020 8:25 AM | Updated on Apr 22 2020 8:25 AM

Salt Merchant Have Coronavirus Positive In Chittoor District - Sakshi

సాక్షి,  పలమనేరు: ఓ ఉప్పు వ్యాపారికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతని వద్ద ఉప్పు కొన్నవారి  గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలమనేరు పట్టణానికి చెందిన 18మంది వ్యాపారులు నాలుగు రోజుల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఓ యువకుడి నుంచి ఉప్పు బస్తాలను కొన్నారు. అతనికి పలమనేరు ట్రూనాట్‌లో గురువారం నిర్వహించిన పరీక్షలో కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు.

తదుపరి పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట తిరుపతికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకైనా మంచిదని తాము కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటామంటూ సిద్ధపడ్డారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement