‘సాక్షి స్పెల్‌బి’ ఫైనల్‌కు సాయిసుజన్ | sakshi spellbee' final Sai sujan | Sakshi
Sakshi News home page

‘సాక్షి స్పెల్‌బి’ ఫైనల్‌కు సాయిసుజన్

Nov 30 2014 1:08 AM | Updated on Aug 20 2018 8:31 PM

‘సాక్షి స్పెల్‌బి’ ఫైనల్‌కు సాయిసుజన్ - Sakshi

‘సాక్షి స్పెల్‌బి’ ఫైనల్‌కు సాయిసుజన్

‘సాక్షి స్పెల్‌బి-2014’ పోటీ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ తరఫున కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ....

ఇబ్రహీంపట్నం: ‘సాక్షి స్పెల్‌బి-2014’ పోటీ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ తరఫున కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సాయిసుజన్ అర్హత సాధించాడు. ఫైనల్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది విద్యార్థులు ఎంపికవ్వగా అందులో కొండపల్లి గ్రామం నుంచి సాయిసుజన్ కూడా ఉన్నారు. ఇటీవల విజయవాడలో సెమీ పరీక్ష రాసి ఫైనల్‌కి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ విద్యార్ధి కొండపల్లిలోని నాగార్జున విద్యానికేతన్‌లో రెండో తరగతి చదువుతున్నారు.

ఫైనల్ పరీక్ష డిసెంబర్ 5న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరగనుందని సాయిసుజన్ తల్లి దుర్గారాణి తెలిపారు. తమ స్కూల్‌కి చెందిన విద్యార్థి ఈ పరీక్షకు ఎంపికకావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ సర్దార్ సాహెబ్, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement