సచిన్ పీఏను అడ్డుకున్న పోలీసులు | Sachin tendulkar pa abducted by Gudur police | Sakshi
Sakshi News home page

సచిన్ పీఏను అడ్డుకున్న పోలీసులు

Nov 16 2014 9:09 AM | Updated on Sep 2 2017 4:35 PM

పుట్టంరాజు వారి కండ్రిగ వెళ్తున్న సచిన్ పీఏ మనోజ్ తివారీని గూడూరు వద్ద పోలీసులు ఆపేశారు.

నెల్లూరు: పుట్టంరాజు వారి కండ్రిగ వెళ్తున్న సచిన్ పీఏ మనోజ్ తివారీని గూడూరు వద్ద పోలీసులు ఆపేశారు. తాను సచిన్ పీఏ అంటూ మనోజ్ పోలీసులకు విన్నవించుకున్నాడు. అయినా పోలీసులు ఖాతరు చేయలేదు. ఈ ఘటనను సాక్షి విలేకర్లు చిత్రీకరిస్తుండగా ఎస్సై అంకమ్మరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్దతి కాదంటూ సాక్షి విలేకర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు.

దీంతో సాక్షి విలేకర్లకు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సచిన్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో సచిన్ ఆదివారం ఆ గ్రామంలో పర్యటించనున్నారు. దాంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement