గణనాథుని శోభాయాత్రలో భాగంగా..
మాచర్ల టౌన్(గుంటూరు): గణనాథుని శోభాయాత్రలో భాగంగా.. గుంటూరు జిల్లా మాచర్ల టౌన్‌లోని 14 వార్డుకు చెందిన మహిళలతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ తమ్ముడు, గణేష్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తొపులాట జరిగి, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఊరేగింపు ప్రాంతానికి చేరుకొని వాగ్వాదం పెరగకుండా అదుపు చేశారు. అనంతరం ఆర్య వైశ్య వర్గం మహిళలతో దురుసుగా మాట్లాడిన గణేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.