చాగల్లులో భారీ దొంగతనం | robbery in west godavari district | Sakshi
Sakshi News home page

చాగల్లులో భారీ దొంగతనం

Dec 18 2015 2:15 PM | Updated on Aug 30 2018 5:27 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది.

చాగల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. స్థానిక మెయిన్‌రోడ్డులో ఉంటున్న కటారు రామచంద్రరావు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.

ఇంటి యజమాని కుటుంబసభ్యులతో రాజమండ్రికి వెళ్లారు. ఇదే అదునుగా దుండగులు తాళాలు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 25 కాసుల బంగారు ఆభరణాలు, మూడు కిలోల వెండి సామగ్రిని ఎత్తుకుపోయారు. ఉదయం తిరిగి వచ్చిన రామచంద్రరావు దొంగతనం విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌టీం రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. నిడదవోలు సీఐ బాలకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement