విజయనగరంలో పట్టపగలు చోరీ | robbery in vijayanagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో పట్టపగలు చోరీ

Mar 16 2015 7:22 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఇంట్లో ఎవరూలేని సమయం చూసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన సంఘటన విజయనగరంలోని సీఎస్‌ఆర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.

విజయనగరం :ఇంట్లో ఎవరూలేని సమయం చూసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన సంఘటన విజయనగరంలోని సీఎస్‌ఆర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాయూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ధర్మాన రామారావు ఇంటికి తాళం వేసి ఎప్పటిలాగే విధులకు వెళ్లారు. కాగా ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగులు 8 తులాల బంగారం, అరకిలో వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లారు.

 

సాయంత్రం ఇంటికి వచ్చిన లెక్చరర్ దొంగతనం విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement