వాహనం ఢీకొని మహిళ మృతి | road accident wife died husband hospatalised | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని మహిళ మృతి

Oct 21 2015 8:20 PM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. నందవరం గ్రామానికి చెందిన బడేబూ, రఫీ స్కూటర్‌పై ఎమ్మిగనూరుకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

ఈ ప్రమాదంలో బడేబూ అక్కడికక్కడే మృతిచెందింది. రఫీ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఎమ్మిగనూరు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement