ఘోర ప్రమాదం; ఆటో నుజ్జు నుజ్జు | Road Accident Near Kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడ సమీపంలో ఘోర ప్రమాదం

Oct 22 2018 4:34 PM | Updated on Oct 22 2018 8:35 PM

Road Accident Near Kakinada - Sakshi

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు.

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది గాయపడ్డారు. టాటా మ్యాజిక్ ఆటోను టిప్పర్  బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసు​కుంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జయిపోయింది. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలం బీతావహంగా ఉంది. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులు విశాఖపట్నం జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో గృహప్రవేశానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
చేబ్రోలు రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement