
సాక్షి, కర్నూలు : పాణ్యం మండలం బలనూరు మెట్ట వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండిని ఓ లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు.
కొంతమంది స్థానికులు పొలం పనుల కోసం ఎద్దుల బండిపై వెళ్తుడగా ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.