జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం | road accident in jaggayyapeta | Sakshi
Sakshi News home page

జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం

Mar 7 2015 9:33 PM | Updated on Aug 30 2018 3:56 PM

గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొనడంతో ఆరేళ్ల పాప మృతి చెందింది.

జగ్గయ్యపేట(కృష్ణా జిల్లా): గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొనడంతో ఆరేళ్ల పాప మృతి చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో జాతీయ రహదారి 65 శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన ఒక కుటుంబం ఆటోలో పెనగంచిప్రోలు జాతరకు వెళ్లారు. జాతర నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటోను అనుమంచిపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న డ్రైవర్‌తో సహా, ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి.

 

గాయాలయిన వారిని జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనం కోసం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement