రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి | remand prisoner suspicious death | Sakshi
Sakshi News home page

రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి

Oct 17 2015 6:24 PM | Updated on Oct 20 2018 6:19 PM

రిమాండ్ ఖైదీ అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం సాయంత్రం జరిగింది.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : రిమాండ్ ఖైదీ అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దక్కిలి మండలం వెంగుళూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గానుగ శ్రీను(35) ఎర్ర చందనం స్మగ్లింగ్ పాల్పడుతుండగా.. పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ క్రమంలో శనివారం అనారోగ్యానికి గురైన శ్రీనును పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట అతను మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులు హింసించడం వల్లే శ్రీను మృతిచెందాడని ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement