అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపండి | Reddy Shanthi Padayatra Support to Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపండి

Oct 6 2018 7:35 AM | Updated on Oct 6 2018 7:35 AM

Reddy Shanthi Padayatra Support to Praja Sankalpa Yatra - Sakshi

కొత్తూరులో పాదయాత్ర చేపడుతున్న రెడ్డి శాంతి, పార్టీ నాయకులు

శ్రీకాకుళం, కొత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి శాంతి శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు.

కొత్తూరు నుంచి నీలకంఠాపురం వరకు 7 కిలోమీటర్ల మేర నడిచి వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు, విద్యార్థులు, మహిళలు, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య మంత్రి కాగానే అందరి సమస్యలను పరి ష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని మెట్టూ రుకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి అప్పన్న, యువజన నేత పడాల లక్షణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కన్నయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement