వనిపెంటలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | Red sandalwood worth Rs. 7 lakhs seized in YSR Kadapa District | Sakshi
Sakshi News home page

వనిపెంటలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Sep 26 2014 12:10 PM | Updated on Oct 22 2018 1:59 PM

వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వాహనంతోపాటు స్మగ్లర్లను పోలీసు స్టేషన్కు తరలించారు. స్మగ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వనిపెంట సమీపంలో పోలీసులు ఈ రోజు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భం ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement