2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood worth Rs 2 crore seized, 34 held in Chittoor District | Sakshi
Sakshi News home page

2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Nov 4 2014 10:40 AM | Updated on May 10 2018 12:34 PM

2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం - Sakshi

2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో మంగళవారం రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో మంగళవారం రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన 34 మందిని అదుపులోకి తీసుకుని...  అలాగే 9 వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు పీలేరు పట్టణంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తొమ్మిది వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement