ఈ క్షణాలు తీపి గుర్తులు: రతన్‌ టాటా | Ratan Tata Attend Andhra University Alumni Meet In Visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 10 2018 7:59 PM | Last Updated on Mon, Dec 10 2018 8:02 PM

Ratan Tata Attend Andhra University Alumni Meet In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలకు పరి​శ్రమలతో ఇంటరాక్షన్‌ పెరగాలని పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా అభిలాషించారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో పరిశోధనలు విస్త్రతంగా జరగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సంద​ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఈ క్షణాలు తీపిగుర్తులుగా మిగిలిపోతాయన్నారు. 

విశాఖపట్నం క్లీన్‌ సిటీగా అభివర్ణించారు. ఈ నగరంపైపై ఇప్పటివరకూ దృష్టి సారించలేదని.. ఇకపై పెడతామన్నారు. విశాఖలో టాటా గ్రూప్‌ ఏ రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశంపై ముంబైలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇక ఇదే సమ్మేళనంలో పూర్వ విద్యార్థిగా పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థిగా రావటం చాలా ఆనందంగా ఉందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement