పోలీస్ కస్టడీలోనే రమేష్ మృతి | ramesh died in police custody | Sakshi
Sakshi News home page

పోలీస్ కస్టడీలోనే రమేష్ మృతి

Feb 12 2015 6:37 PM | Updated on Aug 21 2018 7:17 PM

పాత నేరస్తుడు పుల్లా వెంకట రమేష్ (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

విజయవాడ : పాత నేరస్తుడు పుల్లా వెంకట రమేష్ (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గొలుసు చోరీలతో సంబంధం ఉన్న రమేష్‌ను పెనమలూరు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి రామవరప్పాడు రింగ్ వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో కొంగల మందు మింగి మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీపీ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలు వెల్లడించారు. రమేష్‌కు చైన్ స్నాచింగ్‌లతోనే కాకుండా ఇంకా పలు చోరీలతో సంబంధం ఉందని పేర్కొన్నారు. రమేష్ మృతిపై చట్టపరంగా చేయాల్సిన అన్ని లాంఛనాలు పాటించి పోస్టుమార్టం జరిపించామని వివరించారు. అలాగే పశువుల ఆస్పత్రి సెంటర్‌లో సోమవారం రాత్రి ఆర్‌ఎస్‌ఐ తనను కొట్టారని సీఏ విద్యార్థి కళ్యాణ చక్రవర్తి పెట్టిన కేసును స్వచ్ఛందంగా సీబీసీఐడీకి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement