breaking news
ramesh died
-
తల్లి చెంతకు కూతుళ్లు
హైదరాబాద్: చిన్నప్పుడే విడిపోవడంతో తల్లి ఎలా ఉంటుందో ఆ కూతుళ్లకు తెలియదు. కూతుళ్లు ఎలా ఉంటారో ఆ తల్లికి తెలియదు. అయితే ఓ ఘటన ఈ తల్లీకూతుళ్లను కలిపింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జహీరానగర్‌లో నివసించే పద్మ, రమేష్ దంపతులకు మౌనిక అనే కూతురు ఉంది. రోడ్డు ప్రమాదంలో రమేష్ మృతి చెందిన తర్వాత పద్మ తమ ఇంటి సమీపంలో ఉండే గోవిందును వివాహం చేసుకుంది. వీరికి మరో కూతురు సోని జన్మించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం.. పెద్ద కూతురు వయసు ఆరేళ్లు, చిన్న కూతురు వయసు ఆరు నెలలు ఉన్నప్పుడే మద్యానికి బానిసై పద్మ ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో గోవిందు లక్ష్మీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే లక్ష్మికి ఓ కొడుకు ఉన్నాడు. గోవిందుతో మళ్లీ ఓ కొడుకు.. కూతురు.. పుట్టారు. వీరికి పిల్లలు కలగగానే పద్మకు పుట్టిన ఇద్దరు పిల్లలపై వివక్ష చూపడం ప్రారంభించారు. ఈ క్రమంలో గత అయిదేళ్లుగా మౌనికను నెలలో 20 రోజుల పాటు వ్యభిచారానికి పంపించసాగారు. మౌనిక ఎదురుతిరిగితే చావబాదేవారు... తిండి పెట్టకుండా పస్తులుంచేవారు. ఇటీవల చిన్న కూతురు సోనిని కూడా వ్యభిచారం వైపు నెట్టారు. దీంతో మౌనిక ఇంట్లో నుంచి పారిపోయి రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. ఇదంతా పత్రికల్లో చూసిన అసలు తల్లి పద్మ శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. కూతుళ్ల పరిస్థితిని చూసి కన్నీటిపర్యంతం అయింది. చిన్న కూతురిని చదివిస్తానని.. పెద్ద కూతురికి వివాహం చేస్తానని పద్మ పోలీసులకు తెలియజేసింది. -
యువకుడి ఆత్మహత్య
చేవెళ్ల(రంగారెడ్డి): పొలం దగ్గరికి వెళ్తున్ననని చెప్పి వెళ్లిన యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రమేష్(20) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలానికి వెళ్తున్నానని చెప్పి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
పోలీస్ కస్టడీలోనే రమేష్ మృతి
విజయవాడ : పాత నేరస్తుడు పుల్లా వెంకట రమేష్ (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గొలుసు చోరీలతో సంబంధం ఉన్న రమేష్‌ను పెనమలూరు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి రామవరప్పాడు రింగ్ వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో కొంగల మందు మింగి మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీపీ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలు వెల్లడించారు. రమేష్‌కు చైన్ స్నాచింగ్‌లతోనే కాకుండా ఇంకా పలు చోరీలతో సంబంధం ఉందని పేర్కొన్నారు. రమేష్ మృతిపై చట్టపరంగా చేయాల్సిన అన్ని లాంఛనాలు పాటించి పోస్టుమార్టం జరిపించామని వివరించారు. అలాగే పశువుల ఆస్పత్రి సెంటర్లో సోమవారం రాత్రి ఆర్ఎస్ఐ తనను కొట్టారని సీఏ విద్యార్థి కళ్యాణ చక్రవర్తి పెట్టిన కేసును స్వచ్ఛందంగా సీబీసీఐడీకి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు.