'బాబు శ్వేతపత్రం ... టీడీపీ కరపత్రం' | Raghuveera reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు శ్వేతపత్రం ... టీడీపీ కరపత్రం'

Jul 3 2014 8:08 PM | Updated on Sep 2 2017 9:46 AM

'బాబు శ్వేతపత్రం ... టీడీపీ కరపత్రం'

'బాబు శ్వేతపత్రం ... టీడీపీ కరపత్రం'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రంపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రంపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం టీడీపీ కరపత్రంలా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నిక ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అవాస్తవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన సాకుతో చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. అందుకే అసత్యాలు మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement