
ముఖ్యమంత్రివి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు
పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ సీఎం చంద్రబాబు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం
దీనిపై జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ సీఎం చంద్రబాబు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారని తెలిపారు. పైగా వారితో రాజీనామా చేయించకుండానే ఏప్రిల్ 2న జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని వివరించారు. రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించాల్సిన గవర్నర్ నరసింహన్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని లేఖలో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.