పట్టభద్రుల స్థానాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శనివారం ప్రకటించారు
సాక్షి, అమరావతి: పట్టభద్రుల స్థానాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శనివారం ప్రకటించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థిగా యడ్ల ఆదిరాజు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల అభ్యర్థిగా మాసూలు శ్రీనివాసులు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ యలూరి రామచంద్రారెడ్డి పోటీ చేస్తారని తెలిపారు.