కేశినేని నానీపై పీవీపీ వర్గీయుల ఫైర్‌ | PVP aids fires on Kesineni Nani | Sakshi
Sakshi News home page

కేశినేని నానీపై పీవీపీ వర్గీయుల ఫైర్‌

Apr 25 2014 7:49 PM | Updated on Sep 2 2017 6:31 AM

కేశినేని నానీపై పీవీపీ వర్గీయుల ఫైర్‌

కేశినేని నానీపై పీవీపీ వర్గీయుల ఫైర్‌

కేశినేని నానీ, పొట్లూరి వీ ప్రసాద్ వర్గీయుల మధ్య వివాదం మరింత రాజుకుంది.

విజయవాడ: కేశినేని నానీ, పొట్లూరి వీ ప్రసాద్ వర్గీయుల మధ్య వివాదం మరింత రాజుకుంది. కేశినేని నానీపై పొట్లూరి వీ ప్రసాద్ వర్గీయుల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీవీపీకి కేశినేని నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేయడంతో విజయవాడ స్థానిక రాజకీయాలు మరింత వేడెక్కాయి. 
 
శ్రీరామ్‌ కంపెనీ నుంచి రూ.18కోట్లు రుణం తీసుకున్నారని, కాని నామినేషన్‌ సమయంలో రూ.3 కోట్లతో సెటిల్ చేసుకున్నారని పీవీపీ వర్గీయులు ఆరోపించారు.  సన్‌మార్క్‌ ఫైనాన్స్‌ కంపెనీ దివాలాకు కేశినేని నానియే కారణమన్నారు. 
 
1996లో కేశినేని టూర్స్‌&ట్రావెల్స్‌ పేరుతో వీసాలు ఇప్పిస్తానని విద్యార్ధులకు కుచ్చుటోపి పెట్టిన చరిత్ర కేశినేనిదని పీవీపీ వర్గీయులు ఆరోపించారు.  యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో కేశినేని డీఫాల్టర్ అని, కేశినేని అక్రమాలను త్వరలో బయటపెడతాం పీవీపీ వర్గీయులు హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement