తలపై ఇటుకలు పెట్టి..మోకాళ్లపై నిలబెట్టి | Punishment to the scool student | Sakshi
Sakshi News home page

తలపై ఇటుకలు పెట్టి..మోకాళ్లపై నిలబెట్టి

Feb 21 2016 10:39 AM | Updated on Sep 3 2017 6:03 PM

తలపై ఇటుకలు పెట్టి..మోకాళ్లపై నిలబెట్టి

తలపై ఇటుకలు పెట్టి..మోకాళ్లపై నిలబెట్టి

పాఠశాలల్లో విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవడం సహజం. అయితే అది విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉండకుండా వారిలో మార్పు తెచ్చేలా ఉంటే ఎవరూ అభ్యంతరం పెట్టరు.

పాఠశాలల్లో విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవడం సహజం. అయితే అది విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉండకుండా వారిలో మార్పు తెచ్చేలా ఉంటే ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు తీవ్రమైన శిక్షలు విధించడం దారుణమే. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న శిక్ష అలాంటిదే.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో గత కొద్ది రోజులుగా ఓ ఉపాధ్యాయుడు దండన పేరుతో విద్యార్థుల నెత్తిపై నాలుగు ఇటుకలు పెట్టి గంటల తరబడి మోకాళ్లపై కూర్చోబెడుతున్నారు. ఈ శిక్షను భరించలేని విద్యార్థులు కొందరు రహస్యంగా సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించి ‘సాక్షి’కి అందించారు.   
 -ప్రొద్దుటూరు టౌన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement