వైఎస్సార్ జిల్లాలో ఓ సైకో కలకలం సృష్టించాడు. వోగులవారిపల్లె మండలం జీవీపురం గ్రామంలో వెంకట రమణ అనే ఉన్మాది తుపాకి తీసుకుని కాలుస్తూ గందరగోళం సృష్టించాడు.
వైఎస్సార్ జిల్లాలో ఓ సైకో కలకలం సృష్టించాడు. వోగులవారిపల్లె మండలం జీవీపురం గ్రామంలో వెంకట రమణ అనే ఉన్మాది తుపాకి తీసుకుని కాలుస్తూ గందరగోళం సృష్టించాడు. అతడు జరిపిన కాల్పులలో తోట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
పొలం తగాదాలో తన తండ్రిని కొట్టి చంపారని వెంకటరమణ చెప్పేవాడు. గతంలో ఒక వ్యక్తిని కాల్చిచంపడం, మరోవ్యక్తిని కత్తితో నరికి చంపినట్లు ఆరోపణలున్నాయి. తోట సుబ్రహ్మణ్యం ప్రాణాలకు కూడా ముప్పు ఉండటంతో అతడికి గతంలో గన్మన్ రక్షణ కూడా కల్పించారు. కానీ ఇటీవలి కాలంలో ఆ భద్రత ఉపసంహరించడంతో పొలం వద్దకు వెళ్లి మరీ తుపాకితో కాల్చిచంపాడని అంటున్నారు.