విజయవాడలో సైకో వీరంగం | Psycho Hulchul At Vijayawada Panja Centre | Sakshi
Sakshi News home page

విజయవాడలో సైకో వీరంగం

May 26 2019 2:45 PM | Updated on May 26 2019 2:50 PM

Psycho Hulchul At Vijayawada Panja Centre - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని పంజా సెంటర్‌ వద్ద సైకో వీరంగం సృష్టించాడు. ఆ ప్రాంతంలో రెచ్చిపోయిన సైకో మనుషులపై కర్రలతో, సీసాలతో దాడికి యత్నించారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సైకోను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల రాకను చూసిన సైకో అక్కడే ఎదురుగా ఉన్న అండర్‌ డ్రైనేజీలోకి వెళ్లి దాక్కున్నాడు. దీంతో సైకోను బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement