నేడు స్వస్థలానికి పృథ్వీరాజ్‌ భౌతికకాయం

Prudvi Raj Dead Body Coming Guntur Today - Sakshi

అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో గల సిన్‌సినాటి నగరంలో ఈ నెల ఆరో తేదీన ఉన్మాది జరిపిన కాల్పుల్లో తెనాలికి చెందిన కందేపి పృథ్వీరాజ్‌(26) ప్రాణాలు కోల్పోయాడు. అతని భౌతిక కాయం మంగళవారం రాత్రికి స్వస్థలానికి చేరుకోనుంది. అమెరికా నుంచి కార్గో విమానంలో తీసుకొస్తున్న పృథ్వీరాజ్‌ భౌతికకాయం తొలుత ముంబయ్‌ విమానాశ్రయానికి చేరుతుంది. అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి తరలిస్తారు. శంషాబాద్‌ నుంచి అంబులెన్స్‌లో స్వస్థలౖమెన తెనాలికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుజరుగుతున్నాయి.

గుంటూరు, తెనాలిరూరల్‌: అయెరికాలోని ఓహియో రాష్ట్రంలోని సిన్సీనాటి నగరంలో ఈ నెల 6న దుండగుడు కాల్పుల్లో మృతి చెందిన తెనాలి  కందేపి పృథ్వీరాజ్‌(26) మృతదేహం మంగళవారం రాత్రికి స్వస్థలానికి చేరుకోనుంది. అమెరికా నుంచి కార్గో విమానంలో భౌతిక కాయం సోమవారం బయలుదేరింది. మంగళవారం ముంబయ్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాత్రి తొమ్మది గంటల ప్రాంతంలో శంషాబాద్‌  చేరుకుని అక్కడి నుంచి తెనాలికి అంబులెన్సులో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున తెనాలి చెంచుపేటలోని ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. చదువులో రాణించే పృథ్వీరాజ్‌ తాను చదివిన తమిళనాడులోని బిట్‌ విద్యా సంస్థకు చెందిన మరో ఐదుగురు స్నేహితులతో కలసి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని వారు వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలలో స్థిరపడ్డారు. పృధ్వీరాజ్‌ ఫిఫ్త్‌ థర్డ్‌ బ్యాంక్‌లో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. అజయ్‌ మల్లిన, యశ్వంత్‌ ఎద్దులపల్లి, వెంకట్‌ పూళ్ల తదితర ఆరుగురు మిత్రుల బృందంలో పృధ్వీరాజ్‌ చురుకుగా ఉండేవాడని తెలుస్తోంది.  దారుణ ఘటన అనంతరం సిన్‌సినాటిలో పంచనామా, ఇతర వ్యవహారాలు పూర్తి చేసి, మృతదేహాన్ని న్యూజెర్సీ తరలించారు. అక్కడి నుంచి స్వదేశానికి బయలుదేరింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top