
శృంగవరపుకోట రూరల్: విజయనగరం నుంచి అరకు విహారయాత్రకు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా కిందికి దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విజయనగరంలోని ఫుట్‌వేర్ వర్తకులు, పలు షాపుల మేనేజర్లు 26 మంది విశాఖ జిల్లాలోని అరకు వెళ్లేందుకు విజయలక్ష్మి ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు.
మంగళవారం ఉదయం వారు బయలుదేరి తొలుత తాటిపూడి జలాశయాన్ని సందర్శించారు. అక్కడ నుంచి అరకు వెళ్తుండగా కిల్తంపాలెం నవోదయ విద్యాలయం వద్దకు వచ్చేసరికి బస్సు వెనుక భాగం నుంచి వైర్లు కాలుతున్న వాసన వచ్చింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా బస్సు దిగేయడంతో సురక్షితంగా బయట పడ్డారు.
ప్రైవేట్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం