breaking news
private bus catches fire
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
శృంగవరపుకోట రూరల్: విజయనగరం నుంచి అరకు విహారయాత్రకు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా కిందికి దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విజయనగరంలోని ఫుట్వేర్ వర్తకులు, పలు షాపుల మేనేజర్లు 26 మంది విశాఖ జిల్లాలోని అరకు వెళ్లేందుకు విజయలక్ష్మి ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం వారు బయలుదేరి తొలుత తాటిపూడి జలాశయాన్ని సందర్శించారు. అక్కడ నుంచి అరకు వెళ్తుండగా కిల్తంపాలెం నవోదయ విద్యాలయం వద్దకు వచ్చేసరికి బస్సు వెనుక భాగం నుంచి వైర్లు కాలుతున్న వాసన వచ్చింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా బస్సు దిగేయడంతో సురక్షితంగా బయట పడ్డారు. ప్రైవేట్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం -
ప్రైవేట్ బస్లో మంటలు, ముగ్గురు సజీవదహనం
బెంగళూరు : మహబూబ్నగర్ జిల్లాలో పాలెం వోల్వో బస్సు దుర్ఘటన ఇంకా మరవక ముందే కర్ణాటకలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హుబ్లీ-ధార్వాడ్ వెళుతున్న ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారి వరూర్ సమీపంలో గత రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 16మంది ప్రయాణిస్తున్నారు. పోలీసు ప్రాథమిక విచారణలో బస్సులో మద్యం సీసాలు, సిగరెట్లు, మండే పదార్థాలను లభించినట్లు తెలుస్తోంది. రాపిడి వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.