సీఎంవో అధికారులకు శాఖల పునఃపంపిణీ

Praveen Prakash appointed as Principal Secretary to APradesh CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ప్రవీణ్‌ ప్రకాష్‌ బాధ్యతలు చేపట్టడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ముఖ్య సలహాదారు అజేయకల్లం శనివారం సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లో పనిచేస్తున్న అధికారులకు శాఖలను పునఃపంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధానపరమైన అంశాలు.. కేడర్‌కు సంబంధించిన అంశాలు, ముఖ్యమైన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ముఖ్య సలహాదారు అజేయకల్లం ద్వారానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎంవోలో పనిచేస్తున్న అధికారులకు కేటాయించిన శాఖలు ఇవీ..

అజేయకల్లం, సీఎం ముఖ్య సలహాదారు: హోం శాఖ,  ఆర్థిక, ప్రణాళిక శాఖ, రెవెన్యూ శాఖ ,న్యాయ, శాసనసభ వ్యవహారాలు, సీఎం కార్యాలయ వ్యవహారాలు, ఎవరికీ కేటాయించని శాఖలు

డాక్టర్‌ పీవీ రమేష్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యా శాఖ (పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌ఫ్రా

ప్రవీణ్‌ ప్రకాష్, సీఎం ముఖ్య కార్యదర్శి: సాధారణ పరిపాలన, విద్యుత్‌ శాఖ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (పునరి్వభజన చట్టానికి సంబంధించిన అంశాలు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రధానమైన అధికారులతో సీఎం సంప్రదింపులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యదర్శి అంతకంటే దిగువ స్థాయి అధికారులతో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ, సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయనతో పాటు వెళ్లడం), డ్యాష్‌ బోర్డ్స్, సీఎంవో మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌

సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, సీఎం కార్యదర్శి: రవాణా, రహదారులు భవనాలు, ఏపీఎస్‌ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార పౌరసరఫరా>లు, వినియోగదారుల వ్యవహారాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, యువజన వ్యవహారాలు, క్రీడలు, గనులు, భూగర్భవనరులు, కారి్మక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అన్ని సంక్షేమ శాఖలు

జె.మురళి, సీఎం ప్రత్యేక కార్యదర్శి: పశుసంవర్థక శాఖ, డెయిరీ, మత్స్య శాఖ, సహకార, మార్కెటింగ్‌ శాఖ, సాంస్కృతిక శాఖ, ఎంపీలు, ఎమ్మెల్యేల గ్రీవెన్సులు, ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌)
దువ్వూరి కృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి: ఆరి్థక శాఖ, విద్యుత్‌ శాఖ

ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్, జనరల్‌ గ్రీవెన్సెస్‌ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ: సీఎం అపాయింట్‌మెంట్స్, సందర్శకులు, సీఎం రోజువారీ కార్యకలాపాలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top