బీజేపీలోకి ప్రకాశం జెడ్పీ చైర్మన్‌ | Prakasam ZP Chairmen Eedara Haribabu Joined BJP with his Son | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి ప్రకాశం జెడ్పీ చైర్మన్‌

Jul 9 2019 3:04 PM | Updated on Jul 9 2019 5:25 PM

Prakasam ZP Chairmen Eedara Haribabu Joined BJP with his Son - Sakshi

సాక్షి, ఢిల్లీ : ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు భరత్‌ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హరిబాబు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement