చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి | YS Jaganmohan Reddy Shocked by Ongole Incident in Prakasam District | Sakshi
Sakshi News home page

చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

Jun 4 2026 5:33 PM | Updated on Jun 4 2026 6:02 PM

YS Jaganmohan Reddy Shocked by Ongole Incident in Prakasam District

సాక్షి,తాడేపల్లి : ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భభ్రాంతిని వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందటం తీవ్ర విషాదకరం.

అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు  ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరం. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిది. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. 

ప్రకాశంలో విషాదం
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిగి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికి తీశాయి. మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement