గవర్నర్ ఫొటోతో తపాలా ‘మైస్టాంప్’ | postal ap circle made esl narasimhan stamp | Sakshi
Sakshi News home page

గవర్నర్ ఫొటోతో తపాలా ‘మైస్టాంప్’

Nov 15 2014 2:43 AM | Updated on Sep 18 2018 8:18 PM

గవర్నర్ కు తపాలా బిళ్లలను అందజేస్తున్న ఏపీ, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ - Sakshi

గవర్నర్ కు తపాలా బిళ్లలను అందజేస్తున్న ఏపీ, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్

దేశవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంటున్న ‘మై స్టాంప్’ కింద తపాలాశాఖ ఏపీ సర్కిల్ గవర్నర్ నరసింహన్ ఫొటోలతో తపాలా బిళ్లలను రూపొందించింది.

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంటున్న ‘మై స్టాంప్’ కింద తపాలాశాఖ ఏపీ సర్కిల్ గవర్నర్ నరసింహన్ ఫొటోలతో తపాలా బిళ్లలను రూపొందించింది. దీనికి సంబంధించి ఓ ఆల్బమ్‌ను శుక్రవారం సాయంత్రం తపాలాశాఖ ఏపీ, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు.

ఆ తపాలాబిళ్లలు చెల్లుబాటవుతాయని, వాటిని సాధారణ పోస్టల్ స్టాంప్స్ తరహాలో వినియోగించొచ్చని గవర్నర్‌కు వివరించారు. తన చిత్రాలతో ఉన్న స్టాంపులు చూసి గవర్నర్ అబ్బురపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement