'పొన్నాల నమ్మకం ద్రోహం వల్లే టికెట్ పోయింది' | Ponnala Lakshmaiah back stabbed me: Dontu Madhava Reddy | Sakshi
Sakshi News home page

'పొన్నాల నమ్మకం ద్రోహం వల్లే టికెట్ పోయింది'

Apr 9 2014 2:19 PM | Updated on Sep 2 2017 5:48 AM

'పొన్నాల నమ్మకం ద్రోహం వల్లే టికెట్ పోయింది'

'పొన్నాల నమ్మకం ద్రోహం వల్లే టికెట్ పోయింది'

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై డీసీసీ అధ్యక్షుడు దొంతు మాధవరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై డీసీసీ అధ్యక్షుడు దొంతు మాధవరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నాల నమ్మకద్రోహం వల్లే తనకు కేటాయించిన నర్సంపేట టికెట్ చేజారిందని దొంతు మాధవరెడ్డి ఆరోపించారు. అయితే తనకు నర్సంపేట టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మాధవరెడ్డి హెచ్చరించారు.

ఎన్నో ఏళ్లుగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న తనకు టికెట్ కేటాయించిన తర్వాత మరో వ్యక్తికి ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్దితో సేవలందించిన తనను అవమానించారని తన అనుచరులతో వాపోయినట్టు సమాచారం. నర్సంపేట టికెట్ ను జేఏసీ కోటాలో లెక్చరర్ జేఏసీ చైర్మన్ కత్తి వెంకటస్వామికి కేటాయించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement