'సూది సైకో' కోసం పల్లెల జల్లెడ | police search villages for injection psycho | Sakshi
Sakshi News home page

'సూది సైకో' కోసం పల్లెల జల్లెడ

Sep 1 2015 3:07 PM | Updated on Sep 17 2018 6:26 PM

ప్రజలపై ఇంజక్షన్ తో దాడికి పాల్పడుతూ దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న సూది సైకో కోసం వేట ముమ్మరం చేశారు.

అత్తిలి (పశ్చిమగోదావరి జిల్లా) : ప్రజలపై ఇంజక్షన్తో దాడికి పాల్పడుతూ దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న సూది సైకో కోసం వేట ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలోని కొమ్మెర, ఈదూరు, లక్ష్మీనారాయణపురం, చలెంద్రచెరువు తదితర గ్రామాల్లో అత్తిలి ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇల్లిల్లూ తిరుగుతూ పల్సర్ బైక్ ఉన్న వారినందరినీ విచారిస్తున్నారు. 25-30 వయసుగలవారి ఫోటోలు తీసుకుని సైకో బాధితులందరికీ ఆ ఫోటోలను వాట్సప్‌లో పంపిస్తున్నారు. దాంతో పల్లెల్లోని పల్సర్ బండ్లు ఉన్న యువకులు భయాందోళనకు గురవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement