పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు | police riding on card players at krishna district | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

Feb 14 2016 8:19 PM | Updated on Sep 17 2018 6:26 PM

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు - Sakshi

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

కృష్ణాజిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి

కంకిపాడు: కృష్ణాజిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 వేల నగదుతో పాటు ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 17 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మరిన్ని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement