‘జేసీ.. క్షమాపణ చెప్పాల్సిందే’

Police Officers Fires On Former MP JC Diwakar Reddy Over His Controversial Comments  - Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు.. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. వేదికపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను వారించకపోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసింది. బూట్లు తుడిచేందుకు తాము టీడీపీ బానిసలం కాదని, బుల్లెట్లు ప్రయోగించటంలో శిక్షణ పొందిన ప్రజాసేవకులం అని పేర్కొంది. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. జేసీ దివాకర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పోలీసుల సంఘం డిమాండ్‌ చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top