రామచంద్రారెడ్డిపై పోలీసు కేసు | police case filed on mla ramachandra reddy | Sakshi
Sakshi News home page

రామచంద్రారెడ్డిపై పోలీసు కేసు

Mar 5 2014 8:09 AM | Updated on Aug 21 2018 6:21 PM

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోలీసుల అత్యుత్సాహం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కేసులు నమోదు చేశారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోలీసుల అత్యుత్సాహం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని 309, 108, 30 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సందర్భంగా బుధవారం నాడు రాయదుర్గం బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కానీ రాష్ట్రపతి పాలన అములో ఉన్నందున బంద్ చేయకూడదని పోలీసులు చెప్పారు. రాయదుర్గం సీఐ భాస్కర్‌రెడ్డిని డిస్మిస్ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement