సుప్రీంకోర్టుకు తిరుపతి ఎన్కౌంటర్ వ్యవహారం | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు తిరుపతి ఎన్కౌంటర్ వ్యవహారం

Published Thu, Apr 9 2015 12:29 PM

సుప్రీంకోర్టుకు తిరుపతి ఎన్కౌంటర్ వ్యవహారం - Sakshi

చిత్తూరు : తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్కౌంటర్ను  నిరసిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.  ఎన్కౌంటర్పై సీబీఐ లేదా సిట్తో విచారణ జరిపించాలని ఆ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో కోరింది. న్యాయస్థానం పిటిషన్ను విచారణకు స్వీకరించింది.

మరోవైపు ఇదే అంశాన్ని న్యాయమూర్తి కృష్ణమూర్తి ఈరోజు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఎదుట ప్రస్తావించారు. అయితే సరైన పిటిషన్ రూపంలో కోర్టుకు రావాలని ఆయన సూచించారు. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని న్యాయవాది కృష్ణమూర్తి తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ, ఏపీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆయన కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలని కృష్ణమూర్తి కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement